Followers

సమీక్ష సమావేశం నిర్వహించిన జోనల్ కమిషనర్

 సమీక్ష సమావేశం నిర్వహించిన జోనల్ కమిషనర్

కూకట్పల్లి, పెన్ పవర్

కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత శుక్రవారం ముసాపేటలోని తన కార్యాలయంలో స్వచ్ఛ హైదరాబాద్, ఆస్తిపన్ను వసూళ్ళు, మరియు ట్రేడ్ లైసెన్సు వసూళ్ళపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో స్వచ్ఛ సర్వేక్షన్ 2021కు సంబంధించిన బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతున్న సందర్భంగా జియుపిలు మరియు చెత్తకుండీలు తొలగించిన  ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. కూకట్ పల్లి జోన్ పరిధిలో పరిశుభ్రత విషయంలో తగు చర్యలు తీసుకోని స్వచ్ఛసర్వేక్షన్-2021లో మంచి స్థానం సాధించే విధంగా కృషి చేయాలన్నారు. అలాగే నూతనంగా వచ్చిన స్వచ్ఛ ఆటోలను ఇప్పటివరకు అందుబాటులో లేని ప్రాంతాలకు కేటాయించాలని ఎలాంటి విమర్శలు రాకుండా చూడాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై సమీక్షించి సహాయ వైద్యాధికారులు, లైసెన్స్ ఆఫీసర్లు, సహాయ లైసెన్స్ అధికారులు వారికి కేటాయించిన టార్గెట్ ప్రకారం లైసెన్స్ ఫీజులు వసూళ్లు చేయాలని లేని పక్షములో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్తిపన్ను వసూళ్లపై సర్కిళ్లవారీగా ఆరా తీసి టార్గెట్ ప్రకారం పన్ను వసూళ్లకు ఆయా సర్కిళ్ల ఉపకమిషనర్లు ప్రతిరోజు సంబంధిత అధికారులతో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటూ రోజువారీ టార్గెట్ ప్రకారం వసూళ్లు చేయాలని లేనిచో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా కమిషనర్ కు నివేదిక సమర్పించాలని హెచ్చరించారు. అలాగే ఆస్తిపన్ను బకాయిదారులందరు వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ లో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో రవీందర్ కుమార్, ప్రశాంతి, మంగతయారు, యాదయ్య, సంపత్ కుమార్, చంద్రశేఖర్, నిర్మల, శ్రీభాను ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...