పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఒక లక్ష రూపాయల విరాళం
వికారాబాద్ , పెన్ పవర్
పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పరిగి వ్వాపారుల నుండి విరాళంగా అందజేసారు. ఈ సందర్భంగా కన్ కల్ ప్రభాకర్ గుప్తా మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలకు పరిగి గ్రీన్ మర్చంట్ అసోసియేషన్ వారి తరఫున లక్ష రూపాయలు విరాళం సేకరించి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరము ఐదురోజుల వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించేవారని కోవిడ్ నిబంధన వలన ఈసారి రెండు రోజులు మాత్రమే బ్రహ్మోత్సవాలను కుదించడం జరిగింది.ఈ స్వామి వారి ఉత్సవాలకు వచ్చే భక్తులు చాలాగ్రామాలనుండి వస్తారని ఇలాంటి వారు తప్పనిసరిగా బౌతిక దూరం పాటించి మాస్కులు పెట్టుకోవాలని కన్ కల్ ప్రభాకర్ వివరించారు.మార్కెట్ కమీటి డ్తెరెక్టర్ సరుపు వీరేశం మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు జరుగడం ఇలాంటి కార్యక్రమాలను దర్శించుకొవడం ఎంతో పుణ్యము కలుగుతుందని వీరేశం వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక, జెడ్పిటిసి హరిప్రియ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సరుపు వీరేశం, ఎంపీపీ అరవిందరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment