తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
పెన్ పవర్,ఆత్రేయపురం
తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ర్యాలీ తెలుగుదేశం పార్టీ నాయకుడు మెర్ల నాగేశ్వరరావు ఇంటి వద్ద స్వర్గీయ ఎన్టీరామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన స్వర్గీయ నందమూరి తారక రామారావు అయన తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం అమలాపురం పార్లమెంటరీ కార్యదర్శి గూటపాటి శ్రీను మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన 8 నెలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో వణుకు పుట్టించిన సినీ రాజకీయ వేత్త ఎన్టీఆర్ గా చెప్పవచ్చు బీసీ కమ్యూనిటీ సభ్యుడు అత్తిలి వెంకటేశ్వర గౌడ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మొదటి నుండి విజయాలు తమ ఖాతాలో వేసుకుని నారా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ కే దక్కినది త్వరలో రాబోయే మండల స్థాయి జిల్లా స్థాయి ఎన్నికలలో మన పార్టీ ఘన విజయం సాధించేలా మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు గార్లపాటి గోపి బందెల వెంకన్న గుడెలా నాగేంద్రకుమార్ గౌడ్ పాలింగి రవి చంద్ర షేక్ గౌస్ కందుల రాంబాబు కఠారి వెంకటేశ్వరరావు పొడుగుమాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment