ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రచారంలకు పాలుపడితే ఊరుకునేది లేదు...
పెన్ పవర్, మేడ్చల్
మేడ్చల్ మండలంలోని నూతనకల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఢిల్లీ వరల్డ్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఫ్లేక్సీలు ఎలాంటి అనుమతులు లేకుండా పెట్టడంతో శుక్రవారం ఉదయం పాఠశాలను సందర్శించిన ఎస్ఎంసి చైర్మన్ వెంకట్ రెడ్డి ఫ్లెక్సీలు చూసి ప్రధానోపాధ్యాయులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల ముందు ఇతర ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి ప్రచారాలకు పాల్పడితే సహించేది లేదని ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ వెంకట్ రెడ్డి వాపోయారు.
No comments:
Post a Comment