వీఆర్ఓలను డీడీఓలుగా నియమించటం హర్షణీయం
పెన్ పవర్,ఆలమూరు
వీఆర్వోల సేవలను గుర్తించి డీడీఓలుగా నియమించడం హర్షించదగ్గ విషయమని ఆలమూరు మండల వీఆర్వోల సంఘం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వీఆర్వోల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం ఆలమూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఓ సంఘ అధ్యక్షులు టీ అబ్బులు, కార్యదర్శులు ఎస్ వినాయకుడు, డి అమ్మాజీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అలుపెరగని ఉత్సాహంతో ప్రజలకు అందిస్తూ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం చేసి వీఆర్వోలుదేనని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వోల సేవలను గుర్తించి డిడిఓగా బాధ్యతలు అప్పగించడం ఎంతో ఆనందకరమైన విషయమన్నారు. గ్రామ సచివాలయాలలో రెవెన్యూ శాఖ సేవలే ఎక్కువని విఆర్వోలు ద్వారా ప్రజలకు అందజేసే కులం-సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్, రేషన్ కార్డు (బియ్యం కార్డు) ,భూముల ఆన్-లైన్ సర్వే భూమి ఏ నెంబర్ ఉన్నదో నిర్దారించుటలో సహాయ పడుట, ప్రకృతి వైపరీత్యాల సమయంలో "పంట నష్టం "ద్వారా రైతులకు సహాయ పడుట, భరోసా వంటి కార్యక్రమాల్లో వీఆర్వోల అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు.ఇలా రకరకాల సంక్షేమ పథకాలను రెవెన్యూ శాఖ మాత్రమే చెయ్యగలరని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి జీవో నెంబర్ 2 ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ స్వామీజీ, బి ఉదయ్ కుమార్, రాంపండు, కే సుబ్రహ్మణ్యం, రాజశేఖర్, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment