నూతన కార్యవర్గాన్ని సన్మానించిన వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖ తూర్పు, పెన్ పవర్
వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ని జీవీఎంసీ 16 వార్డ్ పరిధిలో గల ఇసుకతోట శ్రీ కృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామ అభివృద్ధి కి పాటు పడాలని, తమవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని అన్నారు. అనంతరం శాలువా కప్పి బొకే తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గోలాగని అప్పారావు, అధ్యక్షుడు పల్లా త్రినాధ్ తో పాటు కార్యవర్గం గణేష్, గోపికృష్ణ, ప్రసాదుల అప్పారావు, రాజు, శ్రీను,గోపి, వినోద్, కృష్ణం నాయుడు పాల్గొన్నారు.
No comments:
Post a Comment