వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమ పాలన ...
విజయనగరం,పెన్ పవర్
ప్రజా సంక్షేమ పాలకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఆశీర్వదిస్తూ నగరపాలక ఎన్నికలలో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని శాసనమండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం 37 వ వార్డు వీటి అగ్రహారం బిసి కాలనీలో, 45 వ వార్డు కేఎల్ పురం రెవెన్యూ కాలనీలో, 11వ వార్డు షాదీఖానా వద్ద ,50 వార్డు గాజులరేగ రాళ్ల వీధి, వైయస్సార్ నగర్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సురేష్ బాబు మాట్లాడుతూ వార్డులు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికలు కీలకమైనవని అన్నారు. ప్రజలు ఆలోచించి ప్రజారంజక పాలన అందిస్తున్న పాలకులకు, నాయకులకు మద్దతుగా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ నవరత్నాలను అమలు చేస్తున్నారన్నారు. దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, మరింత ఆనందంగా అన్ని కుటుంబాలు శ్రేయస్కరంగా ఉండాలంటే వైసిపి అభ్యర్థులను గెలిపించి పార్టీని బలపరచాలని అన్నారు. మంచి ప్రజాదరణ కలిగిన నేతగా కోలగట్ల వీరభద్రస్వామి అండగా నిలుస్తున్నారని ఇదే స్ఫూర్తి కొనసాగాలంటే నగరపాలక సంస్థ పీఠాన్ని వైసిపి కి కట్టబెట్టాలన్నారు. శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ తాత్కాలిక ప్రలోభాలకు ఆకర్షితులై శాశ్వత ఆనందానికి దూరం కావద్దని ప్రజలకు హితవు పలికారు. ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం నాయకులు నగరానికి చేసింది శూన్యమే నని అన్నారు. ఉన్న నిధులను ఖర్చు పెట్టలేక వెనక్కి పంపిన ఘనత తెలుగుదేశం నాయకులకే చెల్లిందన్నారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుని వైసిపికి పట్టం కడితే నగరం అభివృద్ధి బాటలో పయనిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 37 అభ్యర్థి కడియాల రామకృష్ణ, 45 పార్టీ అభ్యర్థి తాళ్లపూడి సంతోషి కుమారి, 11వ వార్టు అభ్యర్థి వెంపటాపు విజయలక్ష్మి, 50వ వార్టు అభ్యర్థి పట్టా ఆదిలక్ష్మి ,వైసిపి నాయకులు,జోనల్ ఇన్ చార్జిలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment