Followers

గర్బిణీ స్థ్రీలకు, బాలింతలకు, చిన్నారులకు సరైన పోషక ఆహారం అందించాలి

 గర్బిణీ స్థ్రీలకు, బాలింతలకు, చిన్నారులకు సరైన పోషక ఆహారం అందించాలి : కౌన్సిలర్

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు పరిధిలో గల అంగన్ వాడి కేంద్రంలో పోషణ, ఆహరం, ఐరన్ మాత్రలు, గుడ్లు, పాలతో పాటు, నీళ్ళు త్రాగుతూ పోషణ ఆహరం తీసుకోవాలని గర్బిణీ స్థ్రీలకు, బాలింతలకు, చిన్నారులకు మేడ్చల్ పురపాలక సంఘం 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23వ వార్డులో గల అంగన్ వాడి కేంద్రంలో పోషన్ అభియాన్ పోషణపక్షం కార్యక్రమంలో ఇంటింటా పోషణ సంబరాలలో భాగంగా సరైన సమయంలో ఎలాంటి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలని గర్బిణీ స్థ్రీలకు, బాలింతలకు, చిన్నారులకు సూచించారు. దీంతో పాటు కరోన మహమ్మారి బారిన పడకుండా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించి అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని మహిళలకు, గర్బిణీ స్థ్రీలకు, బాలింతలకు తగిన జాగ్రత్తలు సూచించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో వడదెబ్బ బారిన పడకుండా గొడుగు వాడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ ఇందిరా, ఆశా వర్కర్ సునీత, ఆయా మణెమ్మ మరియు గర్భిణీ స్థ్రీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...