శ్రీ వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు.. ఉచితంగా కరోనా వ్యాక్సిన్
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖ, వన్టౌన్లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ 50 మంది నిరుపేద వయోవృద్ధులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించింది.వీరితో పాటు వివేకానంద అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించింది.మరో 200 మంది నిరుపేద వయోవృద్ధులకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేయనున్నట్లు సంస్థ కార్యదర్శి వాసుపల్లి ఉమాదేవి మీడియా సమావేశంలో వెల్లడించారు.కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధులందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె తెలియజేశారు.
కరోనా వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు వద్దని, ఎటువంటి వద్ధతులను నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.పలువురు దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రముఖ సంఘసేవకులు జహీర్ అహ్మద్ ఆసుపత్రిలో వీరికి వ్యాక్సిన్ వేయించడం జరిగిందన్నారు.మనసున్న దాతలు మరికొంతమంది ముందుకు వస్తే..నిరుపేద వృద్ధులకు ఉచితంగా వ్యాక్సిన్ వేయించడం జరుగుతుందని దాతలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఒక్కో వృద్ధుడికి రెండు దఫాలుగా వ్యాక్సిన్ వేయించడానికి కేవలం 500 రూపాయలు ఖర్చు అవుతుందని అందుకు దాతలు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో భవాని, నాగమణి, సుజాత, రాణి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment