Followers

తెరాస ప్రభుత్వ హయాం లోనే అభివృద్ధి

 తెరాస ప్రభుత్వ హయాం లోనే అభివృద్ధి

తార్నాక , పెన్ పవర్

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కోటి రూపాయల వ్యయంతో కార్తికేయ నగర్ లోని పాత మంచినీటి పైపులైన్లు ప్లాస్టిక్ పైప్ లైన్ తొలగించి కొత్త పైప్  లైన్ నిర్మాణ పనులను  ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి,  స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ తో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పేద ప్రజలకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, తుంగ తిరుపతి, రమణా రెడ్డి, భూపాల్ రెడ్డి, రామ్ చందర్, అశ్వద్ధామ రెడ్డి,  ముత్యంరెడ్డి, చంద్రశేఖర్, శ్రవణ్, సుగుణాకర్,  కట్ట బుచ్చన్న గౌడ్, శ్రీరామ్ సత్యనారాయణ, మహేష్, నవీన్ రెడ్డి, అశోక్, తిరుమల్, చైతన్య,  శంకర్, జలమండలి  డీజీఎం శిల్పా మరియు కార్తికేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దత్తారెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...