నగర దీపికలు మరింత సమర్థవంతంగా పని చేయాలి
విజయనగరం,పెన్ పవర్నగర దీపికలు మరింత సమర్థవంతంగా పని చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం నాడు నగరంలో ఆయా డివిజన్లో పనిచేస్తున్న నగర దీపికలు ఎమ్మెల్యే కోలగట్ల ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాలు సాధించడం పట్ల ఎమ్మెల్యే కోలగట్ల కు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా గా ఫలితాలు రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన, మరియు డిప్యూటీ మేయర్గా ప్రకటించిన కోలగట్ల శ్రావణికి నగర దీపికలు శాలువా కప్పి ఉచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ ల నుంచి నగర దీపిక లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment