Followers

జర్రెల సర్పంచ్ లలిత గుండె పోటుతో మృతి

 జర్రెల సర్పంచ్ లలిత గుండె పోటుతో మృతి

సకాలంలో అంబులెన్స్ రాక ఆమె మృతి చెందిందని బంధువుల ఆరోపణ..

సర్పంచైన నెలరోజులకే లలిత మృతితో శోకసంద్రంలో జర్రెల గ్రామం..

ముంచంగిపుట్టు, పెన్ పవర్

ముంచంగిపుట్టు మండలంలోని జర్రెల  పంచాయతీకి చెందిన నూతన సర్పంచ్ వంతాల లలిత (37) గుండె పోటుతో మృతి చెందారు.గురువారం రాత్రి పది గంటల సమయంలో ఆకస్మికంగా  గుండె పోటు రావడంతో ఆమె మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల అందించిన వివరా లు ఇలా ఉన్నాయి...గురువారం రాత్రి 10గంటల సమయంలో వంతాల లలిత(37)కు ఆకస్మికంగా గుండె పోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెెెెెెె వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అయితే సమాచారం ఇచ్చినప్పటికీ అంబులెన్స్ సకాలంలో రాలేదు. దీంతో గమనించిన కొంతమంది బంధువులు ఆగమేఘాలతో మండల కేంద్రానికి వెళ్లి ప్రైవేట్ ఆటో బుక్ చేసుకొని జర్రెల గ్రామానికి వెళ్లి సర్పంచ్ వంతాల లలితను హుటాహుటిన మండల కేంద్రంలో గల సిహెచ్ సి కు తరలించారు. అయితే అప్పటికి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.  అంబులెన్స్ అందుబాటులో లేకపోవడమే లలిత మృతికి కారణమని, సకాలంలో అంబులెన్స్ అందుబాటులో ఉంటే లలిత ప్రాణాలు కాపాడుకో గలవారని కుటుంబ సభ్యులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించింది. జర్రెల సర్పంచిగా పదవి చేపట్టి కనీసం ఏడాది కాకుండానే అనంతలోకాలకు వెళ్లడం ఆ పంచాయతీ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సిపిఎం పార్టీ నుంచి ఎన్నో పోరాటాలు చేసి పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి రెండు పర్యాయాలు సిపిఎం పార్టి నుంచి సర్పంచ్ గా గెలిచిన ఘనత ఆమెకె సొంతం.  నూతన సర్పంచ్ అకాల మరణంతో జర్రెల గ్రామం శోకసంద్రంలో మునిగి పోయింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...