Followers

గిరిజన విద్యార్థులకు ఇదేనా విధ్యా బోధనా?

 గిరిజన విద్యార్థులకు ఇదేనా విధ్యా బోధనా?

అరో తరగతి విద్యార్థి కి ఏడో ఎక్కం రాలేదు..

ఉపాధ్యాయులపై ఐ.టి.డి.ఏ.పీఓ ఆగ్రహం...

పెన్ పవర్,విశాఖపట్నం

 గిరిజన విద్యార్థుల విద్యాబోధనలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని  పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( టి డి ఎ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్  సలిజామల  హెచ్చరించారు. సోమవారం సాయంత్రం  అంజలి శనివారం తదితర ప్రభుత్వ పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు  విద్యా బోధన  పై పరిశీలించారు. అంజలి శనివారం  మినీ గురుకులంలో  తరగతి విద్యార్థిని ఏడో ఎక్కం  చెప్పమన్నారు. విద్యార్థి  బిక్కమొహం వేసి  ఎగాదిగా  చూడడంతో  విద్యాబోధన ఏ మేరకు జరుగుతుందో ఆయన విష్మయం చెందారు. దీంతో ఆగ్రహించిన ఆయన గిరిజన విద్యార్థుల విద్య నాణ్యత ప్రమాణాల్లో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజన విద్యార్థులకు విద్యాగంధం పూయాలన్న సంకల్పంతో  ప్రభుత్వం కోట్లాది రూపాయలు వచ్చేస్తున్న  ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. పాఠశాలల అభివృద్ధికి నాడు నేడు పథకం అమలు చేస్తున్న ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా  ఉన్నాయన్నారు. గడువు నాటికి నాడు నేడు పనులు పూర్తి కావాలని లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. పాఠశాలలో  గిరిజన విద్యార్థులకు విద్యా బోధన నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఉపాధ్యాయులకు హెచ్చరించారు. నాడు నేడు పనులు  నిర్లక్ష్యం చేసిన అంజలి శనివారం ప్రధానోపాధ్యాయురాలు అచ్చమ్మకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నాడు నేడు పనులు విద్యా బోధన నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో వెంకటేశ్వర సంజామల హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...