ఆదిత్య బిజినెస్ స్కూల్ లో మహిళా దినోత్సవ వేడుకలు
గండేపల్లి,పెన్ పవర్గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్యా ప్రాంగణంలో గల ఆదిత్య బిజినెస్ స్కూల్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసంధర్భంగా మహిళా ఉపాధ్యాయ ఉపాద్యాయేతర సిబ్బంది కి విద్యార్థినులకు వివిధ పోటీలు నిర్వహించారు.విజేతలకు బహుమతులు అందజేశారు.డైరెక్టర్.డా.ఎన్.సుగుణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు జైశివ సంతోషి ఫాలిప్యాక్ సంస్థ యజమాని అల్లు సత్యవతి, శ్రీరామ్ హెర్బల్ ఇండస్ట్రీస్.విజయనగరం సంస్థ కు చెందిన రమాదేవి, ట్రెండీ టిక్లింగ్ ప్రొప్రైటర్. ఎన్.శ్రీవల్లి,బి.జినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డా.డి.ఆస్థాశర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈసంధర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీ పురుష లింగ బేధం లేకుండా మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకు పోతున్నారనీ, అభద్రతా భావం విడనాడి ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు అని విద్యార్థులకు వివరించారు.ఉన్నత లక్ష్యంతో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయి కి చేరే వరకూ నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ముఖ్య అతిథులుగా హాజరై వారిని ఆదిత్య యాజమాన్యం తరుపున జ్ణాపిక శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
No comments:
Post a Comment