అక్రమంగా తరలిస్తున్న పాన్ మసాలా ప్యాకెట్లు పట్టివేత...
గుడిహత్నూర్, పెన్ పవర్
అక్రమంగా తరలిస్తున్న పాన్ మసాలా గుట్కా ప్యాకెట్లను సోమవారం రాత్రి గుడిహత్నూర్ లో నిర్మల్ బస్ స్టాప్ వద్ద పట్టుకున్నట్లు ఎస్సై ఎల్. ప్రవీణ్ తెలిపారు. మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర కు మాక్స్ పికప్ వాహనంలో భారీగా పాన్ మసాలా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు గుడిహత్నూర్ లో వాహనాన్ని అపి తనిఖీ చేయగా పాన్ మసాలా ప్యాకెట్లు లభ్యమయ్యాయన్నారు వీటికి సంబంధించిన అనుమతి పత్రాలు, జీఎస్టీ కి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో పాన్ మసాలా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ ఐదు లక్షల 76వేలు ఉంటుందని తెలిపారు. పాన్ మసాల ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు ఈ సమావేశంలో ఏఎస్సై కాత్లే రమేష్,కానిస్టేబుల్ బాలాజీ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment