Followers

పంచాయతీ లో అడుగుపెట్టిన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు

 పంచాయతీ లో అడుగుపెట్టిన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు



 పెన్ పవర్,కొవ్వూరు

 కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ  సీనియర్ నాయకులు గారపాటి వెంకట కృష్ణారావు  మరియు ముళ్ళపూడి రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో గెలిచిన  సర్పంచి నెరేడుమిల్లి నాగమణిw/o నాగేశ్వరరావు ఉప సర్పంచ్ వెంపాటి యుగంధర్ రావు మరియు వార్డు మెంబర్లు అందరూ సోమవారం పంచాయతీ లో అడుగు పెట్టి వారికి కేటాయించిన  సీట్లో కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వెంపాటి యుగంధర్ మాట్లాడుతూ ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ధర్మవరం ప్రజలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని ఇచ్చిన హామీలు  నెరవేరుస్తామని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం టిడిపి సీనియర్ నాయకులు గారపాటి వెంకట కృష్ణారావు , ముళ్లపూడి రాజేంద్ర ప్రసాద్,  జలెం చిరంజీవి, సరిపల్లి గంగరాజు మరియు నాయకులు కార్యకర్తలు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...