ముగిసిన ట్రైనీ అధికారుల పర్యవేక్షణ.
మెదక్, పెన్ పవర్మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లోని రామంతపూర్ గ్రామంలో గత ఐదు రోజులు పాటు ప్రభుత్వ పథకాలపై పర్యవేక్షిస్తున్న ట్రైనీ అధికారుల పర్యటన ముగిసింది. శనివారం చివరి రోజు ట్రైనీ అధికారులు దీక్ష ఐ. సి ఏ. ఎస్ సుస్మిత ఐ. సి. ఎల్. ఎస్ రవి ప్రసాద్ ఐ. ఎస్. కుమార్ సింగ్ ఐ. ఎఫ్. ఎస్ గ్రామసర్పంచ్ ప్రణీత వేణుగోపాల్ రెడ్డి లు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గ్రామస్తులు ప్రజాప్రతినిధుల సహకారంతో ఐదు రోజులపాటు ప్రజా సమస్యలు ప్రభుత్వ పథకాలపై అధ్యయనం చేశామని ప్రజలకు కావాల్సిన మరిన్ని సౌకర్యాలను మౌలిక వసతులను కల్పించేందుకు తమ నివేదికలను జిల్లాకలెక్టర్ కు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వినోద్ విఆర్ఓ వెంకటేశం, నాయకులు శ్రీనివాస్ నాయక్ ఆ శాఖ అధికారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment