సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
పరవాడ,పెన్ పవర్
మండలం లోని పెదముసిడివాడ పంచాయతీ పరిధి పచ్చి గోరుపాలెం గ్రామంలో సుమారు రూ" 7 లక్షల సీసి రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ పల్లా నాగమణి బుధవారం శంకుస్థాపన చేశారు. సర్పంచ్ గా గెలిచాక పచ్చి గోరుపాలెం అభివృద్ధే తన లక్ష్యం అని అందులో భాగంగా గ్రామంలో నూతనంగా సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పెదముసిడివాడ పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అలమండ వెంకటలక్ష్మి, స్థానిక వైసీపీ నాయకులు అలమండ నారాయణరావు, వీరలింగం, సూరిబాబు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment