Followers

వైయస్సార్ బీమా రెండు లక్షలు అందజేత

 వైయస్సార్ బీమా రెండు లక్షలు అందజేత

 గోకవరం,పెన్ పవర్

గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఒక మహిళకు వైయస్సార్ బీమా పథకం కింద మంజూరైన రెండు లక్షల రూపాయల సహాయం  మంజూరు పత్రాలను ఆ గ్రామ సర్పంచ్ విజేత బత్తుల వెంకట రామకృష్ణ (శ్రీను)  బాధిత కుటుంబానికి అందజేశారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సహకారంతో ఈ మంజూరు లభించిందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అచ్యుతాపురం గ్రామానికి చెందిన బత్తుల వెంకటరమణ ఇటీవల మృతిచెందటంతో ఆయన సతీమణి అంజలికి  ఈ మంజూరు పత్రాలు అందజేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో వార్డ్ నెంబర్ జాజుల రామకృష్ణ   తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...