వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఎమ్మెల్సీగా జయ సారథి రెడ్డినిగెలిపించాలి
..వామపక్షాల నాయకులు
నెల్లికుదురు,పెన్ పవర్
వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గ వామపక్ష పార్టీలఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథి రెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారంమహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఆ పార్టీల మండల కార్యదర్శులు వరిపెల్లి వెంకన్న,పెరుమాండ్ల తిలక్ బాబు లు మండల కేంద్రం నెల్లికుదురుమరియు ,పార్వతమ్మ గూడెంలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు పట్టభద్రులైన ఓటర్ల ఇళ్లలోకి వెళ్లి ప్రశ్నించే గొంతు విజయ సారథి రెడ్డిని గెలిపించడానికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ్ ఇసంపెల్లి సైదులు తూటి వెంకట్ రెడ్డి,గారె అనిల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment