వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కెసిఆర్ నిర్ణయం
రైతుల పక్షపాతి సిఎం కెసిఆర్
మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను. గత సంవత్సరాలాగే ఏర్పాటు చేయాలని సి.ఎం.కె.సి ఆర్. నిర్ణయం తీసుకోవడం పట్ల మండల రైతాంగం పక్షాన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మార్కేట్ కమీటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి అన్నారు. అలాగే మండు వేసవిలో సిరిసిల్ల నియోజకవర్గానికి వరప్రదాయిని అయిన ఎగువ మానేరు ను కాళేశ్వరం జలాల ద్వారా నింపి సిరిసిల్ల రైతాంగానికి మరో సారి తనది రైతు ప్రభుత్వం అని నిరూపించారని మార్కెట్ కమిటీ చైర్మెన్ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల శేఖర్ రెడ్డి, టి. ఆర్.ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి. బాల్ రాజ్ నర్సాగౌడ్, లంబసత్యం పాల్గొన్నారు.
No comments:
Post a Comment