వీరేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ని ప్రారంభించిన సర్పంచ్ కే వెంకట సుధారాణి
పెన్ పవర్,ఉలవపాడుఉలవపాడు మండలం లోని వీరే పల్లి గ్రామంలో డి ఆర్ డి ఎ వైయస్సార్ క్రాంతి పథకం ఆధ్వర్యంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏ డి ఏ సిహెచ్ నాగరాజు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం సాధారణ రకం కింటా ధర 1868 గ్రేడ్ ఎ రకము కింటా ధర 1888 ధర మద్దతు ధర నిర్ణయించటం ప్రభుత్వం తరఫున తెలిపినారు. అలాగే తమ శాతం 17 గా ఉండాలని తెలిపినారు. ఏవో for మాట్లాడుతూ ప్రతి రైతు ముందుగా ఈ కాపు నమోదు చేసుకోవాలని దాన్ని అమ్మేవారు ఆ బి కే లో రిజిస్ట్రేషన్ ముందుగానే నమోదు చేసుకోవాలని తెలిపారు.
అలాగే ఏ పీ ఎం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంల వద్ద కొనుగోలు చేయు ధాన్యము ఏ నాణ్యత ప్రమాణలు కలిగి ఉండాలని అదేవిధంగా రైతు 5 ఎకరాల వరకు పండించిన పంటను ఇక్కడే అమ్ముకోవచ్చని తెలిపారు.రైతులకు మద్దతు ధర కల్పించి దళారుల నుండి రైతులను కాపాడినందుకు వీరేపల్లి సర్పంచి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోతాసిల్దార్ కే సంజీవ్ రావు. వ్యవసాయ అధికారి మాల్యాద్రి. ఏ పీ ఎం ఆర్ చెన్నయ్య . వీరేపల్లి సర్పంచ్ కె వెంకట్ సుధారాణి. చాగోల్లు సర్పంచ్ లేళ్లపల్లి లతా చంద్రశేఖర్. కారసాల శ్రీనివాసులు. ఎన్. పోతురాజు. సీసీలు. సబ్ కమిటీ సభ్యులు. రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment