పరవాడ గ్రామంలో "ప్రపంచ జల దినోత్సవ'' కార్యక్రమం...
పరవాడ, పెన్ పవర్
పరవాడ గ్రామంలో "ప్రపంచ జల దినోత్సవ'' సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ప్రజా పరిషత్ అధికారి హేమ సుందరరావు, రాష్ట్ర సి.ఈ.సి, సభ్యులు పైల శ్రీనివాస్ రావు హాజరు అయ్యారు. ముందుగా పరవాడ సంతబయలు నుండి రామాలయం విధి మీదుగా ఎలిమెంటరీ స్కూల్ నుండి సంతబయలు వరుకు ర్యాలీ గా వెళ్లి అనంతరం మానవహారం చేసిన అనంతరం సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభ ను ఉద్దేశించి ఎంపీడీఓ హేమ సుందరరావు మాట్లాడుతూ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మనం నీటిని కాపాడాలి, ప్రతి నీటి బొట్టు వెలువైందిగా భావించాలి. మనం నీటిని సంరక్షించుకోకపోతే మనకు, మన భావితరాలకు నీరు దొరకడం ఎండమావే అవుతుంది. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు. రాను రాను మనకు నీరు దొరకడం కష్టమే. ప్రజలందరూ ఎవరికివారు తమ ఇళ్లల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకుంటే వర్షపునీరు, మనం వాడుకునే నీరు భూగర్భంలోకి వెళ్లి జలాలు వృద్ధి చెందుతాయి. దీని వల్ల మనకు నీరు దొరుకుతుంది, మనం వాడుకున్న నీరు ఇంకిపోయి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండి దోమలు లేకుండా, జబ్బులు రాకుండాఉంటుంది.రక్షిత మంచినీటి సదుపాయం లేక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.
అధికారులు దీనిపై దృష్టిపెట్టి ప్రజలకు మంచి నీరు అందించి మరణాలు నివారించవచ్చు. ప్రభుత్వమే చేయాలి మనకు ఎందుకులే అని ప్రజలు భావించకుండా ఇది ప్రతీ ఒక్కరి భాద్యత అని భావించి మనం మన ఇళ్లల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకుని మనల్ని మనం కాపాడుకుందాము అని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, వ్యవసాయ అధికారి చంద్రావతి , ఏపియో భాగ్యలత, ఏపిఎం సాయి రమేష్, పంచాయతీ సెక్రెటరీ అచ్చుతరావు, ప్రభుత్వ అధికారులు , పిఎంసి చైర్మన్ పైల హరీష్, పైల టీవీ అప్పారావు, వాలంటీర్స్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment