డ్రోన్ తో దోమలమందు పిచికారి చేయించిన కార్పొరేటర్ నార్నే
కూకట్ పల్లి, పెన్ పవర్
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ వద్ద గల అంభిర్ చెరువులో ఎంటమాలజి అధికారులు ఏఈ ఉషారాణి, ఫాగింగ్ సూపర్వైజర్ నరసింహతో కలిసి డ్రోన్ యంత్రం సహాయంతో దోమల మందు పిచికారీ చేయించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు. ఈసందర్బంగా కార్పొరేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దోమల బెడద గూర్చి, చెరువు పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు ఎంటమాలజీ సిబ్బంది పర్యవేక్షణలో డ్రోన్ యంత్రం సహాయంతో దోమల మందు పిచికారీ చేయించడం జరిగినదని, మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవలని, పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకున్నప్పుడే ఎటువంటి రోగాలు దరిచేరవని అన్నారు. డివిజన్ పరిధిలో ఎలాంటి సమస్య అయినా తన దృష్టికి వస్తే సమస్యను అధికారులకు లేదా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీకి తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, డివిజన్ ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటానని తెలియజేసారు. ఈకార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ వి.సురేష్ రెడ్డి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, సీనియర్ నాయకులుకోటేశ్వర రావు, శ్రీనివాస్, రమేష్ బాబు, సుధాకర్ రెడ్డి, మహేష్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment