Followers

సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో... బైక్ ర్యాలీ

సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో... బైక్ ర్యాలీ

మద్దిలపాలెం,  పెన్ పవర్

ఈనెల 26వ తారీఖున భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం సిఐటియు కార్యాలయం నుండి బైక్ ర్యాలీ జరిగింది. ఈ బైక్ ర్యాలీ నుద్దేశించి సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ కె ఎస్ వి కుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయొద్దని, రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ గస్ ధరలు తగ్గించాలని, ఆహార భద్రత కల్పించాలని,మోడీ  ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా 26వ తారీఖున భారత్ బంద్ జరుగుతుందన్నారు. ఈ బందులో వాణిజ్య వ్యాపార విద్య సంస్థలు రవాణా రంగం ఇతర  ప్రభుత్వ రంగ సంస్థలు కార్మికులు ప్రజలు విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ ర్యాలీ మద్దిలపాలెం జంక్షన్ సత్యం జంక్షన్ సీతమ్మధార హెచ్ బి కాలనీ క్రిష్ణ కాలేజ్ రోడ్డు ఎం.వి.పి వెంకోజిపాలెం వాల్తేరు మీదుగా పిఠాపురం కాలనీ కి చేరుకుంది.సిఐటియు నాయకులు కుమార్ మంగళం, వి.కృష్ణారావు, సింహాచలం ,అప్పారావు,వెంకట్రావు, అప్పుడు, సీతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...