పురుషులకంటే మానసికంగా బలమైన మహిళలు స్నిత ప్రజ్ఞులు
పెన్ పవర్,విజయనగరం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పింకథాన్ వరుగు ప్రారంభ కార్యక్రమంలో
- జిల్లా న్యాయమూర్తి జి.గోపి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “పింక్ థాన్" పరుగును ఎస్పీ బంగ్లా కూడలి వద్ద మార్చి 8, సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి జి.గోపి ముఖ్య అతిధిగా హాజరై, “పింక్ థాన్" పరుగును జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా జి. గోపి మాట్లాడుతూ - పురుషులకంటే మహిళలు బలమైన మానసిక శక్తిని కలిగి ఉంటారన్నారు. పురుషులు శారీరకంగా మహిళల కంటే బలవంతులైనప్పటికీ, దుర్భరమైన ఆలోచనలతో చపల చిత్తులుగా మారుతున్నారన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ఉన్నత స్థానాలకు చేరుతున్నప్పటికీ, దురదృష్టవసాత్తు అంతే సమానంగా మహిళలపై దాడులు కూడా సమాంతరంగా పెరుగుతున్నాయన్నారు. ఇది మన ప్రాంతాల్లోని సామాజిక వెనుకబాటు తనానికి నిదర్శనమన్నారు. మన పూర్వీకుల నుండి వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను వారసత్వంగా తీసుకొని, మహిళల స్వేచ్ఛకు ఆటంకంగా నిలిచే చట్రాల్లో కూరుకుపోతున్నామన్నారు. మహిళల పట్ల వివక్ష మన ఇంటిలో నుండే ప్రారంభం అవుతున్నదని, మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలన్నారు మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, నేడు ఆయా కేసులను త్వరితగతిన విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా జిల్లాలో పోక్సో కోర్టు, మహిళా కోర్టును ప్రారంభించుకోవడం శుభపరిణామన్నారు. స్త్రీలకు స్వేచ్ఛ అన్నది కేవలం కాగితాలకు,కొటేషన్లుకే పరిమితం కాకుండా, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రతీ ఒక్కరూ తమవంతు సహకారాన్ని, సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయమూర్తి జి.గోపి అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగారాష్ట్ర డిజిపి శ్రీ గౌతం సవాంగ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను జిల్లా పోలీసుశాఖ తరుపున చేపట్టామన్నారు. ఇందులో భాగంగా “మహిళకు వందనం", "వైద్య శిబిరం”, “క్యాండిల్ ర్యాలీ” నిర్వహించామన్నారు. నేడు విద్యార్ధులు, క్రీడా కారిణులను ప్రోత్సహించేందుకు “పింక్ థాన్" పరుగును నిర్వహిస్తున్నామన్నారు.అంతేకాకుండా, దిశ ఎస్ ఓఎస్ మొబైల్ యాప్ ను డౌనులోడు చేసుకున్న మహిళలకు వస్త్రాల కొనుగోలు పై 20-30శాతం, మొబైల్స్ కొనుగోలు పై 10 శాతం రాయితీని ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషనుల్లోను మహిళలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేడు ప్రారంభించనున్నారన్నారు. ప్రతీ మహిళ కూడా తమకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, అనుకున్న లక్యాన్ని చేరుకోవాలన్నారు. మహిళా కానిస్టేబుళ్ళుకు “ధీర” అనే కార్యక్రమంతో టైక్వాండో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుళ్ళు జిల్లాలో ఉన్న పాఠశాలలు, కళాశాలలను సందర్శించి, మహిళా చట్టాలు గురించి వివరించడంతో పాటు,ఆసక్తి కలిగిన విద్యార్థినులకు ఆత్మరక్షణ మెళుకువలను నేర్పి, స్వశక్తితో వారు ఒంటరిగానే ఆకతాయిలను ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇస్తామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అన్నారు.అనంతరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేసి, మహిళలకుఅందించారు. మహిళలు సాధిస్తున్న విజయాలకు సూచనగా బెలూన్లను ఎగురవేసారు. “పింక్ థాన్" పరుగును జిల్లా న్యాయమూర్తి జి.గోపి జెండా ప్రారంభించారు.జిల్లా ఎస్పీ బి.రాజకుమారి,జిల్లా న్యాయమూర్తి జి.గోపి 3 కిలో మీటర్ల “పింక్ థాన్" పరుగులో స్వయంగా పాల్గొని, పరుగును పూర్తి చేసారు. ఈ పరుగులో విజేతలుగా నిలిచిన రామభద్రపురంకు చెందిన మడక శారద ప్రధమ స్థానంలోను,జామి మండలం శిరుగుడి రోషిణి ద్వితీయ స్థానంలోను, నెల్లిమర్ల కు చెందిన ఆర్మ్డ్ రిజర్వు మహిళా కానిస్టేబులు యర్రంశెట్టి మధుబాల తృతియ స్థానంలోను, బి. లావణ్య, పి. సత్యవతి లకు కన్సోలేషను బహుమతులను జిల్లా న్యాయమూర్తి జి. గోపి అందజేసారు. ఈ పరుగులో విజేతలుగా నిలిచిన వారికి రూ. 5వేలు, రూ. 3వేలు, రూ. 2వేలు, కన్సోలేషను బహుమతులు గెలుచుకున్న వారికి రూ. 1000/-ల చొప్పున నగదును అందజేసారు.
మహిళలపై హింసకు పాల్పడవద్దని “పింక్ థాన్” పరుగులో పాల్గొన్నవారందరూ సంతకాలు చేసి, తమ మద్దతును తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఒఎస్ డి ఎన్. సూర్యచంద్రరావు, విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి. త్రినాధ్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బీ సిఐ జి. రాంబాబు,రుద్రశేకర్, 1వ పట్టణ సిఐ జె.మురళి, 2వ పట్టణ సిఐ సిహెచ్.శ్రీనివాసరావు, రూరల్ సిఐ టి.ఎస్. మంగవేణి, ఆర్ఐ లు చిరంజీవి, పి.నాగేశ్వరావు, పి. ఈశ్వరరావు, నెహ్రూ యువ కేంద్రం మేనేజరు విక్రమాదిత్య,బాలల హక్కుల సభ్యులు పెంకి చిట్టి బాబు, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ ఐలు, మహిళా పోలీసు సిబ్బంది, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment