Followers

దళిత బస్తీలో జరిగిన అక్రమాల గురించి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

దళిత బస్తీలో జరిగిన అక్రమాల గురించి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు...

ఆదిలాబాద్ , పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం పాఠన్ గ్రామంలో లబ్ధిదారులకు అందించిన దళిత బస్తి భూముల్లో అక్రమాల గురించి మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కు  యూత్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. పాఠన్ గ్రామానికి చెందిన కాడే వర్ష అనే మహిళ ప్రభుత్వ అస్సైన్డ్ భూమిని 3 ఎకరాలు తనదిగా చెప్పుకొని దళిత బస్తీ పథకంలో విక్రయానికి పెట్టింది. దీంతో 32/2 సర్వే నంబర్ లో గల ఈ భూమి కొబ్బాయి గ్రామానికి చెందిన కొండ్రావార్ రేఖబాయి లబ్ధిదారుకు కేటాయించారు. కాగా దళిత బస్తీ పథకంలో ప్రభుత్వ భూమిని పెట్టిన మహిళ కాడే వర్ష కు 3 ఎకరాలకు గాను ప్రభుత్వం రూ.15 లక్షల రూపాయలు చెల్లించింది. అయితే దళిత బస్తీలో భూమి పొందిన లబ్దిదారుకు ఇది అసైన్డ్ భూమి కావడంతో పట్టా కావడం లేదు. దీంతో లబ్ధిదారు రైతు బంద్, రైతు బీమాతో పాటు ఇతర పథకాలకు దూరమవుతుంది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే ఇది అస్సైన్డ్ భూమి అని అధికారులు సమాచారం ఇచ్చారు. ఇదే విషయం మండల రెవ్వెన్యు అధికారికి తెలిసిన ఉన్నతాధికారులను తప్పుతోవ పట్టించి అక్రమాల్లో బాగంపంచుకున్నట్లు తెలుస్తుంది.. ప్రభుత్వ భూమిని అక్రమంగా కట్టబెట్టి అధికారులు అవినీతి కి పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ విషయం మండల తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తే పట్టా అవుతుందని చెబుతున్నారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించి భాద్యులపై చర్యలు తీసుకోని భాదిత లబ్ధిదారుకు న్యాయం చేసి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ సీక్తా పట్నాయక్ ని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ వెంటనే దానిపై ఎంక్వయిరీ చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సామ రుపేష్ రెడ్డి అన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు చరణ్ గౌడ్,ఉప సర్పంచ్ మల్లయ్య, చంద్రాల రాహుల్, హాకిమ్, బీక్కి గంగన్న, తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...