Followers

కేతిరెడ్డి బండిపై అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి

 కేతిరెడ్డి బండిపై అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి

దేశం కోసం ఉన్నత చదువులు చదివి , రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగిస్తూ , ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములవుతూ , ప్రభుత్వాలకతీతంగా ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్న ఐఎఎస్ కలెక్టర్ ను నీచంగా , హేయంగా , బహిరంగంగా మీడియాలో మాట్లాడిన వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై  అనర్హ వేటు వేసి ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకా రమేష్ బాబు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం దళిత ప్రజా సంఘాల ఆర్ధ్వర్యం లో ధర్నా నిర్వహించి వినతిపత్రం డి.ఆర్.ఓ.కు  సమర్పించారు. ఈసందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులతో ఎదిగి కలెక్టర్ గా సామన్య ప్రజల మన్ననలు అందుకుంటున్న అనంతరం కలెక్టర్ శ్రీగంధం చంద్రుడుపై అసలు పరిపాలన , ప్రజా సంక్షేమం , కనీస అవగాహన లేని ఎమ్మెల్యే కేతిరెడ్డి బహిరంగంగా మీడియాలో కలెక్టర్ ను వ్యక్తిగతంగా దూషించే రీతిలో మాట్లాడటం దుర్మార్గమన్నారు . ఇలాంటి వారిని చట్టా సభలలో కొనసాగించటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు .దేశంలోనే తొలిసారిగా కులాలను సూచించేలా ఉన్న కాలనీ పేర్లుతొలగించాలని ఆదేశించారన్నారు. మాల పల్లె , మాదిగ పల్లె , హరిజనవాడ , దళితవాడ వంటి కులాలను సూచించే పేర్లను మార్చేయాలని ఆదేశించాన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దేశంలోనే తొలిసారి ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆయన అమలు చేశారన్నారు . ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అవార్డును కలెక్టర్ గంధం చంద్రుడు స్వయంగా కేంద్ర వ్యవసాయశాఖామంత్రి తోమర్ చేతుల మీదుగా అందుకున్నారు . అవార్డు అందుకున్న కలెక్టర్‌ను సీఎం జగన్ ప్రశంసించారు . అయితే జగన్ వద్ద గంధం చంద్రుడు ప్రశంసలు అందుకోగా , ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం ఈ క్రెడిట్ జాయింట్ కలెక్టరు దక్కుతుందని , ఆయన చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించడం హేయమైన చర్య అన్నారు. విజయనగరం అభివృద్ధి వేదిక అధ్యక్షుడు పుక్కిళ్ళ షణ్ముఖ రావు మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్ స్వరో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు అని సంజయ్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారురు. వారి ఇరువురు పై అట్రాసిటీ కేసు నమోదు చేయకుంటే  ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో బహుజన కళా మండలి కార్యదర్శి ఆతవ ఉదయ భాస్కర్, ఆదడా మోహన రావు, గంటన అప్పారావు, గండ్రేటి సత్యనారాయణ, కొమ్ము సోములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేగేటి సంతోష్, కింతడా పైడి రాజు, బోనెల అరుణా, ఎద్దు సంతోషి, విజయనగరం నియోజకవర్గ కన్వీనర్ అయినాడ కృష్ణ, గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ పెంట శంకర్ రావు, సోము మురళీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...