అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సీజ్..
కీసర నుండి గుజరాత్ కు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టివేత ..
పోలీసుల అదుపులో ఎనిమిది మంది నిందితులు..
పెన్పవర్, మల్కాజిగిరికీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు, పట్టుబడ్డ పిడియస్ బియ్యం తరలిస్తున్న రెండు వాహనాలలో. ఒకటి గుజారాత్ రాష్ట్రం రిజిస్ట్రేషన్ తో ఉన్న 12టైర్ లారీ..మరొకటి మినీ ట్ర్యాలి..అశోక లేలాండ్ ఈరెండు వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పోలీసులకు పట్టుబడ్డాయి.. లారీనెంబర్ జిజె 36 టి 8481 లారీ , టిఎస్ 08 యుఇ 4815 అశోక్ లేలాండ్ పట్టుబడ్డాయి , వీటిలో దాదాపు 30 టన్నుల రేషన్ బియ్యం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. పిడియస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కీసర సి ఐ నరేందర్ గౌడ్ తెలిపారు. ఒక లారీలో 25 టన్నుల రేషన్ బియ్యం,మరో వాహనం అశోక లేలాండ్ లో 40క్వీంటాల గల 100 బ్యాగులు, 4 సెల్ ఫోన్లు పోలీసులు స్వాదీనం చేసుకున్నామని కీసర సిఐ నరేందర్ తెలిపారు...
No comments:
Post a Comment