బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మదన్ లాల్
నెల్లికుదురు, పెన్ పవర్
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని రత్తిరాంతండకు చెందిన ఎంపిటిసి గుగులోత్ మదన్ లాల్ ను ఎన్నుకున్నట్లు బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.బానుప్రకాష్ తెలిపారు.ఈ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు బానుప్రకాష్ ను రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా ఆయన మదన్లాల్ ను సన్మానించారు.మదన్లాల్ అతి చిన్న వయసులోనే ఏబీవీపీ కార్యకర్తగా చురుకైన కార్యక్రమాలు నిర్వహించడంతోమొదట బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి గా ఎన్నుకున్నారు. తరువాత .అయన సేవలు గుర్తించి నాయకత్వం రాష్ట్ర అధికార ప్రతినిధి గా ఎన్నుకున్నారు.తన ఎన్నిక కు సహకరించిన నాయకత్వనికి కృతజ్ఞతలు తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన నెల్లికుదురు నేతలు... మండలానికి చెందిన మదన్ లాల్ బిజెవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధిగాఎన్నిక అయిన సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఎడ్లమహేష్, బీజేవైఎం జిల్లాప్రధాన కార్యదర్శి శంకరబోయిన సురేందర్ ఆయనను కలసి హర్షం వ్యక్తంచేస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు.
No comments:
Post a Comment