కరపలో విజయవంతమైన భారత్ బంద్
పెన్ పవర్, కరప
కరపలో భారత్ బంద్ విజయవంతంగా జరిగింది.సిఐటియు మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహణ జరిగింది. తొలుత బరోడా బ్యాంక్ అనంతరం వ్యాపార సంస్థలు ,పాఠశాలు, సచివాలయం, ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాలు బంద్ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షురాలు M. వీరలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు ప్రజల సంపదను దోచి పెడుతున్నదన్నారు.ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వకపోగా, ఆంధ్రప్రదేశ్ కి ఉన్న ఏకైక అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటు వంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విదేశీ ప్రైవేటు సంస్థ అయినటువంటి పోస్కో కి అమ్మివేయడం దుర్మార్గమన్నారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు మండల అధ్యక్షులు కే .సురేష్ మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించే విధంగా రూపొందించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 120 రోజుల పైబడి భారత రైతాంగం ఢిల్లీలో పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అన్నారు. సిఐటియు మండల కార్యదర్శి R .వెంకటలక్ష్మి మాట్లాడుతూ కార్మికులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చే విధంగా కార్మిక చట్టాలను మార్పు చేసి కోడ్ లుగా రూపొందించారని, తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలన్నారు. AIKMS నాయకులు బసవయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయరాదన్నారు సి ఐ టి యు మండల ఉపాధ్యక్షులు బి.రాంప్రసాద్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ , డీజిల్ ధరలు పెరిఘిపోవడం సామాన్య ప్రజలకు భారంగా మారిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న భారత్ బంద్ ని జయప్రదం చేశారు .కరప సచివాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు మానవహారం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలోవరలక్ష్మి ,వీరవేణి,సత్య,అనంతలక్ష్మి ,విజయ్, చక్రధర్ తదితరులు నాయకత్వం వహించగా అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment