Followers

ఎన్నికల రూల్స్ కచ్చితంగా పాటిస్తాం...మళ్ళ సురేంద్ర

 ఎన్నికల రూల్స్ కచ్చితంగా పాటిస్తాం ...మళ్ళ సురేంద్ర



అనకపల్లి , పెన్ పవర్ 

నేటి నుండి ఎన్నికల రూల్స్ పాటిస్తూ కేవలం ఐదు మంది లోపే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని  నేడు అనకాపల్లి పట్టణం 81వ వార్డు డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి  శ్రీమతి మళ్ళ కృష్ణ కుమారి  మరియు మళ్ళ సురేంద్ర  ఇంటింటి ప్రచారం నిర్వహించారు, స్థానిక గవరపాలెం దిబ్బ రామాలయం గుడి వెనకాల ప్రచారం నిర్వహించడం జరిగింది. 

ఈ సందర్భంగా 81వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  మళ్ళ సురేంద్ర గారు మాట్లాడుతూ  ప్రజల అందరి దగ్గర మంచి స్పందన వస్తుందని ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు నిత్యవసర సరుకులు ధరలన్నీ ఆకాశం అందడంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక రేటు 3500 అని చెప్పి నేడు 18000 తీసుకుంటున్నారని ఇలా ఎన్నో సమస్యలపై ప్రజలందరూ కూడా మళ్ళ సురేంద్ర కి వివరించారు ఈ సందర్భంగా  మళ్ళ సురేంద్ర   మాట్లాడుతూ కచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు గెలుచుకుంటామని మేయర్ పీఠం సాధిస్తామని మేము వచ్చిన తర్వాత వందకి 100% చక్కటి మంచినీటి అందిస్తామని చక్కగా పారిశుద్ధ నిర్వహిస్తామని ఎక్కడ వాటర్ ట్యాంక్ లో ఉన్న మరమ్మత్తులు చేసి అన్ని పని చేసే విధంగా పని చేస్తామని ప్రతి పేదవాడికి ఒక పరిధి లో ఏమేమి ఉంటాయో అన్నీ చేస్తామని తెలియజేస్తూ ఎన్నికల సంఘం వారికి అధికారులకి అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ రూల్స్ అన్ని పాటిస్తామని మళ్ళ సురేంద్ర తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెతకం చెట్టి వెంకట్రావు, బాల, శిల్ప శెట్టి శ్రీనివాసరావు, మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...