Followers

ఆదిలాబాద్ మండలం మంగ్లీ గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ బృందం పర్యటించడం

 ఆదిలాబాద్ మండలం మంగ్లీ గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ బృందం పర్యటించడం

ఆదిలాబాద్ , పెన్ పవర్

 ఆదిలాబాద్ రూరల్ మండలంలోని గిరిజన గ్రామం అయిన మగ్లి గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బృందం నాయకులు పర్యటించారు. ఆదివాసులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ మాగ్లి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక నెల వచ్చిందంటే రేషన్ బియ్యం వాన్వట్ గ్రామం నుంచి 5 కిలోమీటర్లు నెత్తి మీద ఎత్తుకొని తీసుకు పోవాల్సి వస్తుంది అన్నారు. అదేవిధంగా ఊరి బయట ఉన్న చెలిమె నీళ్లు కలుషితమైన నీటిని తెచ్చుకుంటున్నారని, ఆ నీళ్లు తాగడం తో గర్భిణులు చిన్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. గ్రామస్తుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ముఖ్యంగా ఆ గ్రామానికి రోడ్డు అయ్యేవిధంగా గవర్నర్ తో మాట్లాడి చేయిస్తామని గ్రామస్తులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొందరు గ్రామస్తులు పేర్లు రాసుకొని గవర్నర్ దగ్గరికి తీసుకు వెళ్తామని వారి పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. సందర్శించిన వారిలో సొసైటీ చైర్మన్ ఎస్. సంకేశ్వర్, స్టేట్ ఎంసి మెంబర్ విజయ్ బాబు,మేకల వెంకటస్వామి,అయ్యూబ్, బేలా మండల్ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి,నేరడిగొండ కోఆర్డినేటర్ కిరణ్ రెడ్డి,ఉప్పల కిషన్ రావ్, దినేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...