మండిపడ్డ జర్నలిస్టు లు
గొల్లపల్లి, పెన్ పవర్
గొల్లపల్లి మండలం లో వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు జర్నలిస్ట్ పై చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. సోషల్ మీడియాలో వార్తలు పోస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఉన్నాయని గొల్లపల్లి మండల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో మండల తాసిల్దార్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా గొల్లపల్లి మండలానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూపులో జర్నలిస్టుల పై నలుగురు వ్యక్తులు అకారణంగా, అసభ్యకర పోస్టులు పెట్టడం పై జర్నలిస్టు లు మండిపడ్డారు. దీనికి నిరసనగా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ మరియు పోలీసు యంత్రాంగం చర్య తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ నిరసనలో గొల్లపెల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొల్లె రాజన్న, కుమార్, శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి, వేణు, మహేష్, శేఖర్, నజీర్ పాషా, శ్రీధర్, చంద్రశేఖర్, అంకం భూమయ్య, జాకోబు, రాహుల్, వినోద్ కుమార్, రగుపతి, ప్రశాంత్ చారి, ప్రశాంత్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment