Followers

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

 విధులు బహిష్కరించిన న్యాయవాదులు-న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని కల్పించాలి-లక్షెట్టిపేట న్యాయవాదుల డిమాండ్

లక్షెట్టిపెట్,పెన్ పవర్

తెలంగాణ న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే కల్పించాలని లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి భూమరెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు 41-ఎ సీఆర్ పీసీనీ వెంటనే రద్దు చేయాలన్నారు.న్యాయవాదుల రక్షణ చట్ట సాధనకై ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటయ్యేదాకా పోరాటం సాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, ప్రసన్నకుమార్,కారుకూరి సురేందర్,అక్కల శ్రీధర్,కొమ్మిరెడ్డి కుడెల్లి అశోక్,సత్తన్న,అఫ్జల్ బియాబానీ,ఎస్.ప్రదీప్ కుమార్,వేల్పుల సత్యం,రెడ్డిమల్ల ప్రకాశం,సుమన్,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...