సూర్యాపేట ఖమ్మం రహదారిపై రోడ్డు ప్రమాదం
సూర్యాపేట,పెన్ పవర్
సూర్యాపేట ఖమ్మం రహదారి చివ్వెంల మండల శివారులోని రవీంద్ర ఫార్బాయిల్ పక్కన మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి చివ్వెంల మండలం మున్యా నాయక్ తండ కు చెందిన రాముగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment