రోడ్లు నాణ్యత లోపించకుండా వేయండి
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి పంచాయతీలోని డుమ్మంగి నుండి టోబ్బాన గ్రామాల మధ్యలో నూతనంగా వేస్తున్న బీ.టీ రోడ్ నిర్మాణాన్ని డుమ్మంగి గ్రామ సర్పంచ్ పాలక. క్రాంతి కుమార్, గిరిజన యువజన నాయకుడు కడ్రక.మల్లేష్ మంగళవారం వెళ్లి పరిశీలించారు. రోడ్ల నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్ ని పరిశీలించి ప్రభుత్వ సూచనలను అనుసరించి అన్నీ తగుపాళ్లలో కలిపి రోడ్లను నిర్మించాలని నాణ్యత లోపించకుండా ఉండాలని కోరారు.
No comments:
Post a Comment