Followers

ఎవరి ప్లాట్లు వారివే..

 ఎవరి ప్లాట్లు వారివే..

కొలిక్కి వచ్చిన మేడ్చల్ జిల్లా ప్రతాప్ సింగారంలోని స్థల వివాదం..

సర్వేకు వచ్చిన ఆర్డీఓ ముందు పట్టాదారులు ఒప్పుకున్నారని ప్లాటు ఓనర్లు హర్షం..

ఇరువర్గాల వాదనలు విన్న ఆర్డీఓ మల్లయ్య ఎమ్మార్వో విజయలక్ష్మి..

వారం రోజుల్లో తుది తీర్పు ఆర్డీఓ మల్లయ్య వెల్లడిస్తారని బాదితుల ఆశాభావం

విక్రయించిన స్థలానికి అక్రమ పాసుబుక్స్ పొందడమే వివాదాస్పదంగా మారింది..


మేడ్చల్  , పెన్ పవర్

రియల్ దందాలతో భూములకు రెక్కలు రావడంతో..విక్రయించిన భూములనే తిరిగి ఆక్రమించుకునేందుకు భూయజమానులు నీచంగా వ్యవహరిస్తున్నారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామంలోని ప్లాటు యజమానులు పేర్కొన్నారు..జీపిఏ ద్వారా విక్రయించిన సదరు భూమిని..ప్లాట్లు చేసి 390 మందికి విక్రయించిన స్థలానికి "తప్పుడు తహసీల్దారుల" చేతివాటంతో తిరిగి పట్టా పాసు పుస్తకాలు పొందడమేగాక రైతు బందు డబ్బులను కూడా మూడు సంవత్సరాలుగా అనుభవించి ఇపుడు నిజమేనని ఒప్పుకున్నారు..కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారుల తుధితీర్పు కోసం బాధితులు వేచి చూస్తున్నారు.. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందా..వివరాల్లోకి వెళితె..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్ కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామంలోని వివాదాస్పద స్థలం సర్వే నంబర్లు 315, 316, 317లోని సుమారు 25.17 ఎకరాల భూమికి సంభందించిన వివాదం, రెవెన్యూ కోర్టులో పెండింగులో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను రద్దు చేసి ట్రిబ్యునల్ కు అప్పగించగా రెవెన్యూ అధికారులు కేసులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. భూ సంబంధించిన ఇరు వర్గాలతో చర్చలు జరుపుతూ.. వివాదానికి కారణమైన భూమిని సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేసే దిశగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం ముందుకు సాగుతున్నారు.. వీలైనంత వరకు ఇరు వర్గాలను కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నిస్తూ వివాదాన్ని పరిష్కరిస్తున్నారు. 

అక్రమ పాసు పుస్తకాలు.. రైతుబందు పొందుతున్న వైనం

ప్రతాప సింగారంలోని వివాదాస్పద భూమికి అక్రమ పాస్ బుక్స్ , అక్రమంగా రైతు బంధు పొందుతున్న వారి నిగ్గు తేల్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీఓ మల్లయ్య, ఎమ్మార్వో విజయలక్ష్మి, సర్వేయర్లు ఘట్ కేసర్ మండలం ప్రతాప సింగారం గ్రామంలో వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్లు 315, 316, 317లోని 25.17 ఎకరాల భూములను బుధవారం పరిశీలించి రెండో దఫా సర్వే నిర్వహించారు. ఈసంధర్భంగా ప్లాట్ ఓనర్స్, అక్రమంగా పాస్ బుక్స్ తీసుకున్న వారితో ఆర్డీఓ మల్లయ్య, ఎమ్మార్వో విజయలక్ష్మి వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఐతే పాస్ బుక్స్ తీసుకోవడంలో పొరపాటు జరిగిందని ఎట్టకేలకు అధికారుల ముందు పట్టా దారులు మలిపెద్ది మధుసూదన్ రెడ్డితో పాటు మిగితా పట్టా దారులు కూడా ఒప్పుకున్నారని, రైతు బంధు సైతం తీసుకుంటున్నట్టు అంగీకరించారని, ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు తెలిపారు.. ఇది తమకు తెలియకుండానే జరిగిందని మధుసూదన్ రెడ్డి, కృష్ణా రెడ్డి ఆర్డీఓ మల్లయ్యకు తెలిపారని, 1988లోనే "జీపిఎర" ద్వారా 390 ప్లాట్స్ చేశామని.. ప్లాట్స్ కూడా విక్రయించామని అధికారులకు తెలిపారు. జీపిఏ ఇచ్చిన మూడేండ్ల తర్వాత జీపిఏ రద్దుచేసుకున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బాదితులు ఆరోపించారు.. ప్లాట్లు కొన్ని అమ్ముడు పోకపోవడంతో విక్రయించిన స్థలం మొత్తాన్ని అప్పటి ఎమ్మార్వో రాజేశ్వర్ రెడ్డి సహకారంతో పాస్ బుక్స్ పొందినట్లు పేర్కొన్నారని, ఐతే జిపిఏ హోల్డర్ మలిపేద్ది బుచ్చిరెడ్డి నుంచి నేరుగా ప్లాట్ కొన్న వారికి ప్లాట్స్ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంతమంది ప్లాట్స్ ఓనర్స్ ఉన్నారో అంతమంది పొజిషన్ లోకి వెళ్లితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ సంధర్బంగా ఆర్డీఓ మల్లయ్య తమకు న్యాయం జరిగేవిధంగా చూస్తామని చెప్పినట్లు ప్లాట్లు కొనుగోలు దారులు పేర్కొన్నారు.. పట్టదారులు, ప్లాట్స్ ఓనర్స్ తో సమావేశమైన ఆర్డీఓ ఇరు వర్గాల వాదనలు విన్నతర్వాత రాజీ చేశారని బాదితులు తెలిపారు.. వారం రోజుల్లో తుది తీర్పు వెల్లడిస్తామని చెప్పారని. ప్లాట్స్ ఓనర్స్ ఫస్ట్ డాక్యుమెంట్లు ఎమ్మార్వో కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆర్ఐ, సర్పంచ్, భవాని నగర్ వెళ్ఫెర్ అసోసియేషన్ ప్రతినిధులు ఉపేందర్ రెడ్డి, యాదగిరి, భాస్కర్ రెడ్డి, రాజ్ కుమార్, మల్లేష్, జితేందర్ తో పాటు( 300 మంది ప్లాట్స్ ఓనర్స్) పట్టదారులు మలి పెద్ది రఘురామ్ రెడ్డి, శుభాస్ రెడ్డి, కృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...