చీకుమద్దుల పీటిజీలకు అందని సంక్షేమ పధకాలు.
హుకుంపేట, పెన్ పవర్మండలం చీకుమద్దుల పంచాయితీ లోని కారేగరవు పీటీజీ గిరిజన గ్రామంలో పీటీజీ కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు,అనేకసార్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసిన ఏ అధికారి స్పందించి రేషన్ కార్డులు ఇవ్వటం, మంజూరు చేయటం లేదని కారేగరువు గ్రామ పెద్ద మర్రి రాజారావు వాపోయారు.గ్రామాన్ని సందర్శించిన సీపీఎం పార్టీ మండల నాయకులు ,చీకుమద్దుల సెగ్మెంట్ సీపీఎం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి సుడిపల్లి కొండలరావు దృష్టికి ,రేషన్ కార్డులు లేని విషయం చెప్పు కొచ్చారు.తక్షణమే గన్నేరుపుట్టు సచివాలయం అధికారులు,ఎంపీడీఓ గారు,తహసీల్దార్ గారు స్పందించి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కొండలరావు అధికారులను కోరారు. రేషన్ కార్డులు లేక పోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే పరిస్థి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు లేని కుటుంబాల నుండి మర్రి రాజారావు,కె చిన్నయ్య, అప్పన్న, సన్యాసిరావు,చిట్టిబాబు,కిల్లో సుందర్ రావు,కొర్ర చిట్టిబాబు, అప్పలరాజు, కాకారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment