Followers

కరోనా రెండవ దశ వ్యాప్తిపై అప్రమత్తం వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్

 కరోనా రెండవ దశ వ్యాప్తిపై అప్రమత్తం  వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్

పాడేరు, పెన్ పవర్

కరోనా రెండవ దశ వ్యాప్తిపై అప్రమత్తం. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్.కరోనా రెండవ దశ వ్యాప్తిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ నుండి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తప్పనిసరిగా  మాస్క్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు.సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే ఆసుపత్రి క్వారంటైన్ లో లేదా హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని సూచించారు. కరోనా బారిన పడిన రోగులకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.గిరిజన ప్రాంతాల్లో మలేరియా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు.ఏజెన్సీలో  పిన్ పాయింట్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు.క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి వైద్య సేవలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...