మాలసింగారం లో తాగునీటి సమస్య పై స్పందించిన ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి
పరిశీలిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ గ్రామపంచాయతీ సర్పంచ్ధన్యవాదాలు తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకుడు మొస్య ప్రేమ్ కుమార్
అరకు, పెన్ పవర్అరకువేలి మండలం చినలబుడు గ్రామపంచాయతీకి చెందిన మాలసింగారం గ్రామంలో తాగునీటి సమస్యపై అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి వారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో 18-03-2021న గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ మహిళలు యువత నిర్వహించిన నిరసన కార్యక్రమన్ని పత్రిక ప్రకటనల ద్వారా సమస్యను గుర్తించి ఐ.టి.డి.ఎ ప్రాజెక్టు అధికారి వారు ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ మహేష్ ద్వారా మొస్య ప్రేమ్ కుమార్ మొస్య దేవదాసు ఆధ్వర్యంలో చినలబుడు గ్రామపంచాయతీ సర్పంచ్ ఉపేంద్ర మాలసింగారం గ్రామంలో తాగునీటి అవసరాలకు కావలసిన పరిష్కార మార్గాలను పరిశీలించడం జరిగింది, తక్షణమే దీనిపై చర్యలు తీసుకుంటామని సర్పంచ్ గారు ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వారిని ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ ని గ్రామ పంచాయతీ సర్పంచి ని ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన వివిధ పత్రిక సోదరులకు (రిపోర్టర్స్)లకు గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరపున యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ధన్యవాదాలు తెలపడం జరిగింది,ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్ మొస్య అర్జున్ సుంకరి బాలమురళి, మొస్య బుజ్జి బాబు, లోకోయి లక్ష్మణ్ రావు, గరం పూర్ణ, కిల్లో నాగేశ్వరరావు, బీసోయి ముకుంద్, గ్రామ ప్రజలు మహిళలు యువత తదితరులు పాల్గొనడం జరిగింది.
No comments:
Post a Comment