రాష్ట్ర బంద్ గోడపత్రికను విడుదల చేసిన - సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి
పరవాడ,పెన్ పవర్
ఈ నెల 5న రాష్ట్ర బందును విజయవంతం చేయాలని గోడ పత్రికను సిఐటియు ఆధ్వర్యంలో లంకెలపాలెం జంక్షన్ సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి ఆధ్వర్యంలో నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకోవడం అత్యంత దుర్మార్గమని ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈనెల 5న జరిగే బందులో కార్మిక సంఘాల సభ్యులు,అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు నిరసన తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్ణం వెంకట్రావు,శ్రీను సత్తిబాబు,అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment