Followers

వామ్మో కరోన...ఇంటికి చలోనా!

 వామ్మో కరోన...ఇంటికి చలోనా!

ఇంటి బాట పట్టిన విద్యార్థులు




లక్షెట్టిపెట్, పెన్ పవర్

కరోన మహమ్మారి మళ్ళీ విజృంభించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది గురువారం నుంచి పాఠశాలలు కళశాలలు తాత్కాలికంగా మూసి వేసింది దీంతో విద్యార్థులు పెట్టేబెడ సర్దుకుని ఇంటి బాట పడ్డారు హాస్టళ్లు నుంచి తల్లిదండ్రులతో బ్యాగులు బాక్సులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇళ్లకు బయల్దేరారు విద్యార్థులతో లక్షెట్టిపెట్ పట్టణ కేంద్రంలో బస్టాండ్ కిక్కరిసి పోయింది ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగింది బస్సుల్లో సీట్ల కోసం విద్యార్థులు నానా ఇక్కట్లు పడ్డారు..

ఆన్లైన్ పాఠశాలలు షురూ

ప్రభుత్వ పాఠశాలల్లో చదువే విద్యార్థులకు మళ్ళీ ఆన్లైన్ పాటలు మొదలయ్యాయి.డిశాట్, డిడి ఛానళ్ల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు,దాదాపు నెలన్నర రోజులు ప్రత్యేక తరగతులకు హాజరై మళ్ళీ ఆన్లైన్ పాఠాలకు పరిమితం కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అయోమయంలో పడుతున్నారు.ఇక ప్రైవేట్ పాఠశాలలు కాలేజీల నిర్వహికులు సైతం ఆన్లైన్ క్లాసుల దిశగా చర్యలు చేపట్టారు.కొన్ని ప్రైవేట్ స్కూలు ఇంకా పాఠాలే మొదలు పెట్టలేదు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...