స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి మేఘాద్రి రిజర్వాయర్ లో మృతిచెందిన జగదీప్
వేపగుంట, పెన్ పవర్
మేఘాద్రి రిజర్వాయర్ లో గాజువాక పారిశ్రామిక ప్రాంతం అక్కిరెడ్డి పాలెం కి చెందిన పిల్లల జగదీప్ (24) మృతి.నిన్న మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి రిజర్వాయరర్లో మృతిచెందిన జగదీప్. రిజర్వాయర్ సిబ్బంది సమాచారం మేరకు పెందుర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.రాత్రి వరకు మృతదేహం కనిపించకపోవడంతో ఈరోజు ఉదయం గజ ఈతగాళ్లు తో గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాన్ని బయటకు తీశారు.జగదీప్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.పోస్ట్ మార్టం నిమిత్తం కె.జి.హెచ్.కి తరలించారు.
No comments:
Post a Comment