గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం మెగా రక్త దాన శిబిరం
విశాఖపట్నం, పెన్ పవర్
గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ మరియు యాక్ట్విట్స్ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ యునైటెడ్ ఎన్జీవో అసోషియేషన్ మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు.మార్చి 23 అమరవీరుల 90 వ దినోత్సవం పురస్కరించుకుని 28 రాష్ట్రాల్లో 1500 సెంటర్లలో 90 వేల బ్లడ్ యూనిట్ల సేకరణ లక్ష్యం గా ఈ కార్యక్రమం చేసినట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త,స్మార్ట్ సిటీ కొర్డినేటర్ విజినిగిరి బాల భాను మూర్తి తెలిపారు. సర్ధార్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖదేవ్ లాంటి మహనీయులు చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన స్ఫూర్తిని నేటి యువతలో నింపడానికి ఈ మహా ప్రయత్నం జరిగిందన్నారు.ఇందుకోసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కొరకు విశాఖపట్నం జిల్లా నుంచి తనని బాధ్యత వహించటం గర్వంగా ఉందన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ డాక్టర్. ఎం.లక్ష్మి, డాక్టర్.జానకీరామ్, డాక్టర్.ఎస్.కె.ఎల్.రావు లు ఈ శిబిరాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. ఇదే రోజున దేశవ్యాప్తంగా వున్న 28 రాష్ట్రాల్లో 1500 సెంటర్లలో ఈ మహత్తర రక్త దాన శిబిరాలు జరిగాయని వివరించారు.అమర వీరుల ఆదేశంతో యువత అధిక సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేసారని బాను మూర్తి చెప్పారు అలాగే రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందజేసి గౌరవించటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో లాబ్ టెక్నీషియన్ కిరణ్,కేవి సంతోష్ కుమార్, విశాఖ గ్రామీణ వైద్యుల సంఘం కార్యదర్శి లోగిశ గణేష్,రాంబార్కి.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment