ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం
చిన్నగూడూరు, పెన్ పవర్చిన్న గూడూరు మండలంలోని బుధవారం నాడు ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి నివరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది కి టీవీ వ్యాధిపై డాక్టర్ రవి అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ రవి మాట్లాడుతూ... రెండు వారాల పాటు దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, వంటి ఇ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి వ్యాధి నిర్ధారణ జరిగితే వెంటనే 6 నెలల పాటు ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా 500 రూపాయలు పరితోసాకం ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం లు ఎస్తర్ రాణి, నర్సబాయి, వనిత హెల్త్ అసిస్టెంట్ ధర్మేందర్, ఆశ ఆరోగ్య కార్యకర్తలు జ్యోతి , అనిత, కల్పన పాల్గొన్నారు.
No comments:
Post a Comment