సుపరిపాలన కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించండి...అదితి గజపతిరాజు
విజయనగరం కార్పొరేషన్లో సుపరిపాలన కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ అదితి గజపతిరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం 48వ డివిజన్లో, సాయంత్రం 45, 46, 47 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అక్రమాలను అడ్డుకోవాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేవిధంగా ప్రజలు ఓటువేయాలన్నారు. డివిజన్లలో అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందన్నారు. వైకాపా నాయకులు ప్రజా ధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పాలన చేస్తున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ నిరంకుశ పాలనతో పేద ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యావసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. కార్పొరేషన్లో ఆస్తి విలువ ద్వారా పన్నులు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన జీవోలను తీసుకువచ్చిందన్నారు పెంచిన పన్నులను తగ్గించేవరకు తెలుగుదేశం పార్టీ తరపున పోరాటం చేస్తామన్నారు. పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ది జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరైన పనులనే ప్రస్తుత పాలకులు ప్రారంభోత్సవాలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఐవిపి రాజు, బొద్దల నర్సింగరావు, కర్రోతు నర్సింగరావు, కోండ్రు శ్రీనివాసరావు, కోరాడ వెంకటరావు, ఆల్తి బంగారుబాబు, నడిపిల్లి రవి, 48వ డివిజన్ అభ్యర్థి పత్తిగిల్లి సూర్యకుమారి, 49వ డివిజన్ అభ్యర్థి కర్రోతు రాధామణి, 47వ డివిజన్ అభ్యర్థి మైలపల్లి పైడిరాజు 45 వ డివిజన్ అభ్యర్థి కోరాడ శోభారాణి, 46వ డివిజన్ అభ్యర్థి కోండ్రు కృష్ణవేణి, ఆయా వార్డుల పార్టీనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment