బాక్సయిట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి
జీవోనెంబర్ 89 ని రద్దుచేయాలి
గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి : పి.అప్పలనర్శ
పెన్ పవర్,విశాఖపట్నం
భాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానంచేయాలని ,తీసుకువచ్చిన జీవోనెంబర్ 89 ని రద్దుచేయాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్శ డిమాండ్ చేశారు.జికెవిది మండలం లోని అమ్మవారిధారకొండ పంచాయతీ సర్పంచ్ ముర్ల సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికైన సంధర్భంగా బుధవారం పెబ్బంపల్లి గ్రామంలోగిరిజన సంఘం మండల అధ్యక్షుడు ముర్ల చంటిబాబు అధ్యక్షతన నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ..విశాఖ మన్యంలో అపారమైన ఖనిజ సంపదను బాక్సయిట్ ను దోచుకొనుటకు రాజకీయ పార్టీలు జీవోల రద్దు నాటకం ఆడుతున్నాయని,పర్యాటక శాఖ అనుమతులు రద్దు చేయలేదని , జీవోలు రద్దు చేశామని గిరిజనులకు మొసంచేస్తున్నాయని మండిపడ్డారు.టిడిపి జీవోనెంబర్ 22 ను రద్దు చేసి,97 జీవోతీసుకువచ్చింది.వైకాపా ప్రభుత్వం 97ను రద్దుచేసి జీవోనెంబర్ 89 నితీసుకు వచ్చిందని అందుకు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే,గిరిజన సంఘలూ,సిపిఎం పార్టీ నాయకులు ఆందోళనలు చేస్తే ఒరిస్సా నుంచి తెచ్చుకుంటామని మంత్రి విజయసాయిరెడ్డి తెలిపారన్నారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం భాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి జీవోనెంబర్ 89 ని రద్దు చెయ్యలనికోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వ్యవసాయంపై కొత్త చట్టాలు తీసుకురావడంతో రైతులు ఆందోళనలు,నిరాహారదీక్షలు చేస్తూ చలిలో, 150 మంది రైతులు చనిపోయారని పేర్కొన్నారు. అమ్మవారి దారకొండ పంచాయతీ గిరిజనులకు మీ గ్రామానికి ఏ సమస్యపైన అయిన గిరిజన సంఘం గా మేము ఆదుకునేందుకు ముందుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ.. మోడీ తీసుకువచ్చిన ప్రయివేటు విధానాలు తో గిరిజనులకు పెను ప్రమాదం గా మరనుందని ,దేశాకార్మికుల పోరాటాలులో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అల్ ఐ సి, రైల్వే,విద్యుత్, బ్యాంకింగ్,స్టీల్ ప్లాంట్, ఓడరేవుల పరిశ్రమలో ఇప్పుటివరకు రిజర్వేషన్ లో ఉద్యోగులు వచ్చాయని ప్రయివేటు పరం అయితే భవిష్యత్ లోఉద్యోగం కలగానే మరనుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సలిమితి శాంతి, సిపిఎం మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు, జి.సత్యనారాయణ,ఏ దారకొండ సెక్రెటరీ రాధ,వార్డు సభ్యులు,కుమారి,చంద్రమ్మ, అనంద్,మాజీ సర్పంచులు సంధ్యకుమారి, వండలం పండన్న,పన్నెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment