Followers

ఎర్రబెల్లి గూడెం లో పౌరహక్కుల సమావేశం

 ఎర్రబెల్లి గూడెం లో పౌరహక్కుల  సమావేశం...

 హాజరైన తాసిల్దార్ రమేష్ కుమార్,ఎస్సై జితేందర్


నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెం లో జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఆదేశాల మేరకు తాసిల్దార్ అనంతుల రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి నెల్లికుదురు ఎస్ ఐ పి జితేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనంతుల రమేష్, కుమార్ ఎస్సై పి. జితేందర్ లు  మాట్లాడుతూ..ప్రతి పౌరునికి చట్ట పరిధిలో స్వేచ్ఛగా జీవించేహక్కు ఉంటుందన్నారు. మానవ హక్కులకు ఎవరు భంగం కలిగించకూడదని, ఎవరి పరిధిలో వారు చట్టాన్ని అతిక్రమించ కుండా ఉండాలని మరియు అస్పృశ్యత అంటరానితనం అనే భావనలేకుండా  సమాజంలో ప్రతి పౌరుడు కుల మత వర్గ విభేదాలు విడనాడి అందరు సమాన సౌబాతృత్వాలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మెర అశోక్ గౌడ్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు స్థానిక ఎంపీటీసీ బత్తిని అనిల్ గౌడ్ ఆర్.ఐ  మల్లయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...