Followers

అక్రమ అరెస్టులను ఖండించిన మండల కాంగ్రెస్ పార్టీ

 అక్రమ అరెస్టులను ఖండించిన మండల కాంగ్రెస్ పార్టీ

రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్

 ఎల్లారెడ్డిపేట మండలం లోని గుండారం గ్రామంలో పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసే విషయంలో రాజు నాయక్ ను అక్రమ అరెస్ట్ పై సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య తీవ్రంగా ఖండించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులలో ఇరికించి  అన్యాయంగా జైలుకు పంపడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ  నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టినట్లయితే వారిని కూడా హైకోర్టుకు తెప్పించడం ఖాయం అన్నారు. గుండారం లో రాజేందర్ పై పెట్టిన రౌడీషీట్ కేసును హైకోర్టు కొట్టివేయడం జరిగింది అన్నారు. అలాగే రాజు నాయక్ కేసు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్  వేయడం  జరిగిందన్నారు మండల కేంద్రంలో ఇటీవల కేటీఆర్ ప్రోగ్రాం ఉంటే అక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి నిర్బంధించడం జరిగింది అన్నారు. కానీ కేసులకు భయపడేది లేదని జైలుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు తప్పుడు కేసులు పెట్టిన అధికారులను కూడా వదిలిపెట్టేది లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల ఉపాధ్యక్షులు దండు శీను, జిల్లా కార్యదర్శి పందిళ్ళ  లింగం గౌడ్  అధ్యక్షులు ఎస్సి సెల్ అధ్యక్షులు కరిగే శ్రీనివాస్ చిన్ని బాబు బానోతు రాజు నాయక్ ఎం.పి.టి.సి, కొత్త పల్లి పద్మ దేవయ్య, భూక్య శీను రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...